చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా : పృథ్వీ షా

by Harish |

జీవితంలో తాను చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని టీమ్ ఇండియా యువ క్రికెటర్ పృథ్వీ షా తెలిపాడు.

చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా : పృథ్వీ షా
X

దిశ, స్పోర్ట్స్ : జీవితంలో తాను చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని టీమ్ ఇండియా యువ క్రికెటర్ పృథ్వీ షా తెలిపాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నిర్ణయాలే వల్లే క్రికెట్ కెరీర్ ఇబ్బందుల్లో ఉందని అంగీకరించాడు. ‘క్రికెట్‌కు తక్కువ సమయం కేటాయించాను. అలసత్వం ఉందని ఒప్పుకుంటున్నా. అవసరం లేని వాటిని అవసరంగా భావించా. ఈ క్రమంలోనే కొందరు తప్పుడు వ్యక్తులు స్నేహితులయ్యారు. అప్పుడు నేను కెరీర్ పరంగా అగ్రస్థానంలో ఉన్నా. కొత్తగా స్నేహితులయ్యారు. వాళ్లు నా దృష్టిని మరల్చారు. 8 గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడు నాలుగు గంటలే సాధన చేస్తున్నా.’అని పృథ్వీ షా తెలిపాడు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు రిషబ్ పంత్, సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చాడు. కాగా, రాకెట్‌లా దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టులో చోటు కోల్పోయాడు. ఫిట్‌నెస్ సమస్యలు, పేలవ ఫామ్‌తో భారత జట్టుకు దూరమై కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 2021లో చివరిసారిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది ఐపీఎల్ వేలంలోనూ అతను అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.


Next Story