- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ప్లేయర్ కు టైట్ హాగ్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025 ) నేపథ్యంలో... పంజాబ్ కింగ్స్ ( Punjab Kings ) తొలి ఓటమిని

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025 ) నేపథ్యంలో... పంజాబ్ కింగ్స్ ( Punjab Kings ) తొలి ఓటమిని చవిచూసింది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లన్ని గెలిచినా పంజాబ్ కింగ్స్... రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals ) చేతిలో మాత్రం శనివారం రోజున ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో... ఏకంగా 50 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది పంజాబ్ కింగ్స్. అయితే ఈ మ్యాచ్ పూర్తయిన.. ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ఎప్పుడు జరిగినా... పంజాబ్ కింగ్స్ సహా యజమాని ప్రీతి జింటా ( Preity Zinta ) గ్రౌండ్ లో సందడి చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ సారి పంజాబ్ టీమ్ వరస విజయాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో.. మరింత ఉత్సాహంతో ప్రీతిజింటా స్టేడియంలో కనిపిస్తున్నారు.
అయితే నిన్న పంజాబ్ కింగ్స్ ఓటమిపాలైన నేపథ్యంలో... ప్లేయర్లందరినీ ఓదార్చారు బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు ( Shreyas Iyer) గట్టి హగ్ ( Hug) ఇచ్చి మరి ఓదార్చింది. గతంలో కూడా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఎవరైనా సరే... ఇలాగే ఓదార్చేది ప్రీతి జింటా. అయితే ఈసారి... శ్రేయస్ అయ్యర్ వంతు వచ్చింది. బాధలో ఉన్న శ్రేయస్ అయ్యర్ ను దగ్గరికి తీసుకొని... ఓదార్చింది ప్రీతి జింటా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా... గడిచిన రెండు మ్యాచ్ లలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడి... రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో మాత్రం విఫలమయ్యాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఓడిపోవాల్సి వచ్చింది.
PREITY ZINTA WITH CAPTAIN SHREYAS IYER & BOTH TEAM'S PLAYERS TOGETHER. 👌
— Tanuj (@ImTanujSingh) April 6, 2025
- A beautiful Video! ❤️ pic.twitter.com/7g4jwCA5Z5






