- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. వరల్డ్ నం.1 మాగ్నస్ కార్ల్‌సెన్‌కు మరోసారి షాకిచ్చాడు. ఇదే టోర్నీలో కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద మూడో రౌండ్‌లో ఓడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు 8వ రౌండ్‌లో కూడా వరల్డ్ నం.1పై పైచేయి సాధించాడు. బుధవారం జరిగిన గేములో నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 50 ఎత్తుల్లో విజయం సాధించాడు. దీంతో ఒకే టోర్నీలో కార్ల్‌సెన్‌ను రెండుసార్లు ఓడించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. మొదటి ప్లేయర్ భారత టెన్నిస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్. 2007లో లినారెస్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నీలో కార్ల్‌సెన్‌ను విశ్వనాథన్ ఆనంద్ ఓడించాడు. 19 ఏళ్ల తర్వాత ప్రజ్ఞానంద మళ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద టైటిల్ రేసులోకి వచ్చాడు. ప్రస్తుతం అతను పాయింట్స్ టేబుల్‌లో 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు భారత గ్రాండ్‌మాస్టర్, వరల్డ్ చాంపియన్ డి.గుకేశ్ మరో ఓటమిని పొందాడు. ఫ్రాన్స్ ప్లేయర్ అలీరెజా ఫిరౌజా చేతిలో 8వ రౌండ్‌ను కోల్పోయాడు. 9వ రౌండ్‌లో గుకేశ్, ప్రజ్ఞానంద ఎదురుపడనున్నారు.






