Padma Awards : క్రీడా రంగంలో ఐదుగురికి పద్మ పురస్కారాలు.. ఆ ఐదుగురు ఎవరంటే?

by Harish |

కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది.

Padma Awards : క్రీడా రంగంలో ఐదుగురికి పద్మ పురస్కారాలు.. ఆ ఐదుగురు ఎవరంటే?
X

దిశ, స్పోర్ట్స్ : కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. క్రీడా రంగంలో ఐదుగురిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. మాజీ హాకీ ప్లేయర్ పీఆర్ శ్రీజేశ్‌ను పద్మభూషణ్ వరించింది. గోల్‌కీపర్‌గా అంతర్జాతీయ వేదికపై శ్రీజేశ్ భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. టోక్యో ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్‌ల్లో కాంస్య పతకాలు సాధించడంలో అతనిదే కీలక పాత్ర. పారిస్ ఒలింపిక్స్ తర్వాత హాకీకి రిటైర్మెంట్ ప్రకటించిన అతను.. ప్రస్తుతం జూనియర్ హాకీ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత ప్రభుత్వం శ్రీజేశ్‌ను 2015లో అర్జున అవార్డు, 2019లో పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. అలాగే, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పద్మ శ్రీ అవార్డుకు ఎంపికయ్యాడు. అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2015లో అశ్విన్‌కు అర్జున అవార్డు దక్కింది. అలాగే, పారా ఆర్చర్ హర్విందర్ సింగ్, మాజీ రెజ్లర్ సత్యపాల్ సింగ్, మాజీ ఫుట్‌బాలర్ ఐఎం విజయన్‌ కూడా పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. హర్విందర్ సింగ్ టోక్యో పారాలింపిక్స్‌లో కాంస్యం, గతేడాది పారిస్ పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు.


Next Story