- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్మృతి మందాన, పలాష్ పెళ్ళికి కొత్త ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే!
స్మృతి మందాన, పలాష్ వివాహానికి మరో కొత్త ముహూర్తం ఫిక్స్ చేశారట ఇరు

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మందాన ( Smriti Mandhana ), పలాష్ ముచ్చల్ ( Palash Muchhal ) వివాహంపై కీలక అప్డేట్ వచ్చింది. నవంబర్ 23వ తేదీన జరగాల్సిన వీరిద్దరి వివాహం ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే స్మృతి మందాన, పలాష్ వివాహానికి మరో కొత్త ముహూర్తం ఫిక్స్ చేశారట ఇరు కుటుంబ సభ్యులు. డిసెంబర్ ఏడవ తేదీన వీళ్ళ వివాహం జరిపించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలోని సంగ్లీలో వీళ్ల వివాహాన్ని కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే జరిపించాలని అనుకుంటున్నారట.
దీనికి సంబంధించిన న్యూస్ నేషనల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కాగా నవంబర్ 23వ తేదీన స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వివాహం జరగాల్సి ఉండేది. కానీ స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ కు గుండెపోటు రావడంతో అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోయింది. అటు మరుసటి రోజు పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలయ్యాడు. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ పెళ్లి కోసం కొత్త ముహూర్తం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, పలాష్ ముచ్చల్ ( Palash Muchhal ) కు ఇప్పటికే ఓ లేడీ కొరియోగ్రాఫర్ తో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతో ఛాటింగ్ చేస్తూ పెళ్లి కంటే ఒక్క రోజు ముందే స్మృతికి పలాష్ దొరికినట్లు వార్తలు కూడా బయటకు వచ్చాయి. క్లిక్






