చాంపియన్స్ ట్రోఫీనే నా చివరి ఐసీసీ టోర్నీ కావొచ్చు.. స్టార్ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

by Harish |

సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ రస్సీ వాన్ డెర్ డస్సెన్ తన కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

చాంపియన్స్ ట్రోఫీనే నా చివరి ఐసీసీ టోర్నీ కావొచ్చు.. స్టార్ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ రస్సీ వాన్ డెర్ డస్సెన్ తన కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీనే తన చివరి ఐసీసీ టోర్నీ కావొచ్చంటూ వ్యాఖ్యానించాడు. శనివారం ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు శుక్రవారం కరాచీలో ప్రముఖ మీడియా సంస్థతో డస్సెన్ మాట్లాడాడు. ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు వస్తున్నారని, ఎవరైనా తన స్థానాన్ని భర్తీ చేయొచ్చని చెప్పాడు. ‘కచ్చితంగా ఇదే నా ఐసీసీ టోర్నమెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ముందస్తు ఆలోచనలతో తీసుకున్న నిర్ణయమా లేదా మేనేజ్‌మెంట్ నా కెరీర్‌పై నిర్ణయం తీసుకుంటుందా అని నేను చెప్పలేను. చాలా మంది యువ ప్లేయర్లు వస్తున్నారు. వారు బాగా ఆడుతున్నారు కూడా. ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డె జోర్జీ, మాథ్యూ బ్రీట్జ్కే, రికెల్టన్ వంటి వారు సత్తాచాటుతున్నారు. నేను ఆడకపోతే నా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయరని గుడ్డిగా నమ్మను. ఏప్రిల్‌లో నా జాతీయ కాంట్రాక్ట్ ముగియనుంది. భవిష్యత్తులో నా రూల్ గురించి కోచ్, జాతీయ జట్టు డైరెక్టర్‌తో డిస్కస్ చేస్తా. నేను బాగానే ఆడుతున్నా అనుకుంటున్నా. రెండేళ్లలో బాగానే ఉంటే జట్టులో ఉంటానని అనుకుంటున్నా. అలాకాకుండా యువకులు నన్ను వెనక్కినెట్టివేసినా మంచిదే.’ అని తెలిపాడు. సౌతాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించడమే తన బిగ్గెస్ట్ గోల్ అని, తనకు మరో కాంట్రాక్ట్ ఆఫర్ చేస్తే కచ్చితంగా తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. కాగా, చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్తాన్‌పై డస్సెన్ హాఫ్ సెంచరీతో రాణించాడు.


Next Story