హార్దిక్ - మహికా జంటపై పూనమ్ పాండే బోల్డ్ కామెంట్స్.. వీడియో వైరల్

by velandi.Saikiran |

హార్దిక్ పాండ్యా చాలా గొప్ప క్రికెటర్ అంటూనే, అతని ప్రియురాలు మహికా శర్మ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Poonam Pandey Big Statement on Hardik Pandya-Girlfriend Ko Car Gift
X

Poonam Pandey Big Statement on Hardik Pandya-Girlfriend Ko Car Gift

దిశ‌, వెబ్ డెస్క్: బాలీవుడ్ అందాల భామ పూనమ్ పాండే ( Poonam Pandey) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన పూనమ్, తాజాగా హార్దిక్ పాండ్యా, మహికా శర్మ జంటపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. హార్దిక్ పాండ్యా చాలా గొప్ప క్రికెటర్ అంటూనే, అతని ప్రియురాలు మహికా శర్మ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. తన భార్యను వదిలేసి, మహికా శర్మతో హార్దిక్ పాండ్యా డేటింగ్ చేస్తున్నాడని పేర్కొంది. అయితే పెళ్లికాక ముందే ఆమెకు కారు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి ? అని మండిపడింది.

ప్రతి మ్యాచ్ కు మహికా శర్మ కూడా వెళ్లి హార్దిక్ పాండ్యాను ( Hardik Pandya) డిస్టర్బ్ చేస్తోందని మండిపడ్డారు. ఇకనైనా హార్దిక్ పాండ్యా, మహికా శర్మ ఇద్దరు కూడా ఓవరాక్షన్ తగ్గించుకోవాలని చురకలు అంటించింది పూనమ్. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండ‌గా, పూన‌మ్ పాండే ఏదో ఒక వివాదంతో నిత్యం వార్త‌ల్లోనే నిలుస్తూ ఉంటుంది. గ‌తేడాది క్యాన్స‌ర్ తో చ‌నిపోయాన‌ని పోస్ట్ పెట్టిన పూన‌మ్, ఏప్రిల్ 1వ తేదీన తాను ప్రెగ్నెంట్ అంటూ ప్ర‌క‌టించి, అంద‌రినీ ఫూల్ చేసింది. ఇక తాజాగా హార్దిక్ పాండ్యా, మహికా శర్మ జంటపై కామెంట్స్ చేసింది.

Next Story