- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రికెటర్ స్మృతి మందానకు పెళ్లి శుభాకాంక్షల లేఖ పంపిన ప్రధాని మోడీ
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మందాన పెళ్లిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో నవంబర్ 23న ఆమె సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తో వివాహ జరగనున్నట్లు డేట్ ఫిక్స్ అయింది.

దిశ, వెబ్ డెస్క్: భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన (Smriti Mandana) పెళ్లిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో నవంబర్ 23న ఆమె సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తో వివాహ జరగనున్నట్లు డేట్ ఫిక్స్ అయింది. ఈ జంట వివాహం ఇరు కుటుంబాల్లో, అభిమానుల్లో ఆనందాన్ని నింపగా, దేశ నాయకత్వం నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ప్రత్యేక శుభాకాంక్షల లేఖ (Special greetings letter)ను స్మృతి మందానకు పంపించారు. ఒకరి అండగా ఒకరు నిలిచి, ప్రేమ, నమ్మకం, పరస్పర అర్థం చేసుకునే గుణాలతో సంతోషభరితమైన జీవితం సాగించాలని ఆశించారు.
స్మృతి యొక్క గ్రేస్‌ఫుల్ కవర్ డ్రైవ్‌లా, పలాష్ సంగీత సప్తస్వరాలలా ఇద్దరి కలయిక అద్భుతమైన భాగస్వామ్యంగా మారాలని ప్రధాని ఆకాంక్షించారు. అదేగాక, పెళ్లి వేడుకలో Team Groom vs Team Bride పేరుతో జరగనున్న సెలబ్రేషన్ క్రికెట్ మ్యాచ్‌పై కూడా ఆయన ఆనందం వ్యక్తం చేసి, “ఇద్దరూ జీవితంలో జట్టు విజేతలుగా నిలవాలి” అని ఆశీర్వదించారు. స్మృతి–పలాష్ వివాహం ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా, అభిమానులు, సెలబ్రిటీలు, క్రికెట్ & సంగీత రంగాలు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.






