- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లిపీటలు ఎక్కబోతున్న స్మృతి మంధాన.. పెళ్లి ఎప్పుడో తెలుసా?
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరో రెండు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కబోతోంది.

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరో రెండు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌ను ఈ నెల 23న వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్మృతిగానీ, పలాష్‌గానీ వెల్లడించలేదు. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ వీరికి విషెస్ చెబుతూ ఓ లేఖ పంపగా అది వైరల్‌గా మారింది. ఆ లేఖలో స్మృతి, పలాష్ వివాహం ఈ నెల 23న జరగనున్నట్టు ఉంది. కొన్నేళ్లుగా స్మృతి, పలాష్ ప్రేమలో ఉన్నారు. ఇటీవలే ఎంగేజ్‌మెంట్ అయినట్టు కూడా తెలుస్తోంది. తాజాగా స్మృతి తన నిశ్చితార్థం విషయాన్ని పరోక్షంగా తెలియజేసింది. సహచర క్రీడాకారిణులు జెమిమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డితో కలిసి ఓ రీల్ చేసింది. ఆ వీడియోలో స్మృతి తన వేలుకు ఉన్న ఎంగేజ్‌మెంట్ రింగును చూపించింది. తన వివాహంపై స్మృతి మంధాన క్లారిటీ ఇస్తేనే అసలు విషయం తెలుస్తుంది.






