PKL 2025 : బెంగాల్‌ వారియర్స్‌ను చిత్తు చేసిన టైటాన్స్.. వరుసగా రెండో గెలుపు

by Harish |

ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

PKL 2025 : బెంగాల్‌ వారియర్స్‌ను చిత్తు చేసిన టైటాన్స్.. వరుసగా రెండో గెలుపు
X

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 44-34 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. గత మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందిన విషయం తెలిసిందే. బెంగాల్‌పై కూడా టైటాన్స్ అదే జోరు కొనసాగించింది. కెప్టెన్ విజయ్ మాలిక్, భరత్ సత్తాచాటారు. భరత్ 12 పాయింట్లు సాధించగా.. విజయ్ 11 పాయింట్స్ తీసుకొచ్చాడు. దీంతో ఫస్టాఫ్‌లో టైటాన్స్‌దే పూర్తి ఆధిపత్యం. 23-14తో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో ప్రత్యర్థి పుంజుకున్నప్పటికీ టైటాన్స్‌ జోరు ఆగలేదు. చివరికి 10 పాయింట్ల తేడాతో గెలుపొందింది. బెంగాల్ తరపున కెప్టెన్ దేవాంక్(13 పాయింట్స్) పోరాటం ఫలించలేదు. మరోవైపు, దబాంగ్ ఢిల్లీ కే.సీ జోరు కొనసాగుతోంది. ఆ జట్టు హ్యాట్రిక్ విక్టరీ సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌పై 36-35 తేడాతో గెలుపొందింది. కెప్టెన్ ఆషు మాలిక్ 21 పాయింట్లతో చెలరేగి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.


Next Story