PKL 2025 : తెలుగు టైటాన్స్ జైత్రయాత్ర.. వరుసగా ఐదో విజయం

by Harish |

ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ జోరు మీద ఉన్నది.

PKL 2025 : తెలుగు టైటాన్స్ జైత్రయాత్ర.. వరుసగా ఐదో విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ జోరు కొనసాగుతోంది. ఎదురొచ్చిన జట్టునల్లా చిత్తు చేస్తూ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. చెన్నయ్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్‌పై 46-29తేడాతో భారీ విజయం సాధించింది. ఆల్‌రౌండర్ భరత్ మరోసారి దూకుడు ప్రదర్శించాడు. ఏకంగా 20 పాయింట్లతో చెలరేగాడు. అతనికితోడు కెప్టెన్ విజయ్ కూడా 8పాయింట్లతో సత్తాచాటాడు. దీంతో టైటాన్స్‌కు ఎదురులేకుండా పోయింది. మొదటి నుంచి దూకుడు ప్రదర్శించిన టైటాన్స్ ఫస్టాఫ్‌లో 10 పాయింట్ల లీడ్ సాధించింది. ఆ తర్వాత కూడా జట్టు తడబడలేదు. సెకండాఫ్‌లోనూ 20-13‌‌తో టైటాన్స్‌దే పైచేయి. చివరి వరకూ ఆధిపత్యం ప్రదర్శించి 17 పాయింట్లతో భారీ గెలుపు ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నది. టోర్నీలో పుణేరి పల్టాన్ కూడా జోరు మీద ఉన్నది. వరుసగా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా దూకుడుకు చెక్ పెట్టింది. 37-27తేడాతో గెలుపొందింది. రైడర్ ఆదిత్య షిండే 14 పాయింట్లతో పల్టాన్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.


Next Story