- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీకేఎల్‌లో సంచలన పరిణామం.. జట్టు నుంచి పవన్ షెరావత్‌ను తొలగించిన తమిళ్ తలైవాస్
భారతదేశంలో ఐపీఎల్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన టోర్నీలలో ప్రో కబడ్డీ లీగ్ ముందు వరుసలో ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో ఐపీఎల్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన టోర్నీలలో ప్రో కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) ముందు వరుసలో ఉంటుంది. ఈ ప్రో కబడ్డీ లీగ్ కోసం కోట్లాది మంది అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు. ఈ క్రమంలో 12వ సీజన్ ఆగస్టు 29న విశాఖపట్నంలో జరిగిన తెలుగు టైటాన్స్ vs తమిళ తలైవాస్ మ్యాచ్‌తో ప్రారంభం అయింది. అయితే ఈ సీజన్ ప్రస్తుతానికి మంచి రేటింగ్ తో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే పీకేఎల్ లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన వేలంలో భారీ ధర పెట్టి ఇండియన్ కబడ్డీ జట్టు కెప్టెన్ పవన్ షెరావత్ ను కొనుగోలు చేసిన తమిళ్ తలైవాస్ జట్టు (Tamil Thalaivas team).. ఎవరూ ఊహించని విధంగా అర్ధాంతరంగా పవన్ షెరావత్ (Pawan Sherawat)ను జట్టు నుంచి తొలగిస్తున్నట్లు (Removal from the team) ప్రకటించింది.
ఈ ప్రకటనతో పవన్ అభిమానులతో పాటు, కబడ్డీ అభిమానులు సైతం షాక్ కు గురయ్యారు. తమిళ్ తలైవాస్ నిర్ణయంపై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతుండగా.. డిసిప్లినరీ కారణాల (Disciplinary reasons)తో పవన్ను తొలగించిన ఆ జట్టు ప్రకటించింది. అయితే జట్టు నిర్ణయంపై స్పందించిన పవన్ షెరావత్.. తాను ఎలాంటి తప్పు చేయలేదు.. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే జీవితంలో కబడ్డీ ఆడనని ప్రకటించాడు. అలాగే తాను ఇండియన్ టీం కెప్టెన్గా ఉన్నానని, ఆట విషయంలో ఎల్లప్పుడూ డిసిప్లిన్తో ఉన్నానని ఈ సందర్భంగా పవన్ షెరావత్ చెప్పుకొచ్చాడు.






