- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PKL 2025 : ప్రొ కబడ్డీ లీగ్ చాంపియన్‌గా ఢిల్లీ.. రెండోసారి టైటిల్ కైవసం
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్ చాంపియన్‌గా దబాంగ్ ఢిల్లీ కే.సీ నిలిచింది.

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్ చాంపియన్‌గా దబాంగ్ ఢిల్లీ కే.సీ నిలిచింది. ఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్‌లో ఢిల్లీ 31-28 తేడాతో పుణేరి పల్టాన్‌పై విజయం సాధించింది. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన ఆ జట్టు టైటిల్ ఎగురేసుకపోయింది. ఢిల్లీకి ఇది రెండో టైటిల్. 2021లో మొదటిసారి పీకేఎల్ విజేతగా నిలిచింది. గతేడాది 3వ స్థానంతో సరిపెట్టిన ఢిల్లీ ఈ సారి మొదటి నుంచి అదరగొట్టింది. వరుస విజయాలు నమోదు చేసింది. ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ఫస్టాఫ్‌లోనే ఢిల్లీ మ్యాచ్‌పై పట్టు సాధించింది. నీరజ్, అజింక్యాలతోపాటు ఇతర ఆటగాళ్లు కూడా తలో ఓ చేయి వేయడంతో ఫస్టాఫ్‌లో 20-14తో నిలిచి 6 పాయింట్ల లీడ్‌లో సాధించింది. అయితే, సెకండాఫ్‌లో పుణేరి పల్టాన్ పుంజుకుంది. వరుసగా పాయింట్స్ సాధిస్తూ ఢిల్లీ ఆధిక్యాన్ని తగ్గిస్తూ వచ్చింది. ఢిల్లీని ఓసారి ఆలౌట్ కూడా చేసింది. మరికాసేపట్లో మ్యాచ్ ముగిస్తుందనగా 30-28తో దగ్గరి వరకు వచ్చింది. కానీ, ఢిల్లీ ఆధిక్యాన్ని కాపాడుకుని చివరికి మూడు పాయింట్లతో గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది.






