- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PKL 2025 : ఫైనల్‌కు దూసుకెళ్లిన ఢిల్లీ.. ఎలిమినేటర్-3లో తెలుగు టైటాన్స్ ప్రత్యర్థి ఆ జట్టే
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్‌లో సంచలన ప్రదర్శన చేస్తున్న దబాంగ్ ఢిల్లీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్‌లో సంచలన ప్రదర్శన చేస్తున్న దబాంగ్ ఢిల్లీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫయర్-1లో పుణేరి పల్టాన్‌పై అద్భుతమైన విజయం సాధించింది. ఢిల్లీలో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఇరు జట్లు 34-34స్కోరుతో సమంగా నిలిచాయి. దీంతో గేము 5 రైడ్స్‌కు దారితీయగా అక్కడ ఢిల్లీ 6-4తో నెగ్గింది. ఢిల్లీ ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి. 2021లో తొలిసారిగా టైటిల్ గెలిచింది. మరోవైపు, పుణేరి పల్టాన్‌కు ఫైనల్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. క్వాలిఫయర-2లో గెలిచి టైటిల్ పోరుకు చేరుకోవచ్చు.
టైటాన్స్ ప్రత్యర్థి పాట్నా
ఎలిమినేటర్-3లో తెలుగు టైటాన్స్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. నేడు జరిగే మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్‌తో టైటాన్స్ తలపడనుంది. సోమవారం జరిగిన ఎలిమినేటర్-2లో పాట్నా 46-37తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. రైడర్ అయాన్ సంచలన ప్రదర్శన చేసి పాట్నా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఏకంగా 19 పాయింట్లు సాధించాడు. అతనికితోడు అంకిత్ 7 పాయింట్లు, దీపక్ 6 పాయింట్లు తెచ్చారు. దీంతో మ్యాచ్‌లో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన పాట్నా 11 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు ఇంటిదారిపట్టింది.






