- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PKL 2025 : తెలుగు టైటాన్స్ ఖాతాలో హ్యాట్రిక్ పరాజయం
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఓటమిపరంపర కొనసాగుతోంది.

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఓటమిపరంపర కొనసాగుతోంది. ఆరంభంలో తడబడిన ఆ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి పుంజుకుంది. కానీ, ఆ తర్వాత మళ్లీ ఓటమిబాట పట్టింది. వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ కే.సీ 33-29 తేడాతో టైటాన్స్‌పై విజయం సాధించింది. అయితే, ముందుగా టైటాన్స్‌దే పైచేయి. కెప్టెన్ విజయ్, అజిత్ పవార్, మన్‌జీత్ పాయింట్స్ తేవడంతో ఫస్టాఫ్‌లో ఐదు పాయింట్ల లీడ్ సాధించింది. కానీ, సెకండాఫ్‌లో ఆ జట్టు దూకుడుకు ఢిల్లీ బ్రేక్‌లువేసింది. వరుసగా పాయింట్స్ సాధించి చివరికి 4 పాయింట్ల తేడాతో గెలిచింది. ఈ సీజన్‌లో ఓటమెరుగని ఢిల్లీకి వరుసగా ఇది 6వ విజయం కావడం విశేషం. ఆ జట్టులో రైడర్ నీరజ్ 9 పాయింట్లు, సౌరభ్, ఫజెల్ చెరో 5 పాయింట్లతో సత్తాచాటారు. మరో మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్‌పై 32-43 తేడాతో హర్యానా స్టీలర్స్ గెలుపొందింది.






