- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PKL 2025 : ఎలిమినేటర్-3కి దూసుకెళ్లిన తెలుగు టైటాన్స్
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఎలిమినేటర్-3కి దూసుకెళ్లింది.

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఎలిమినేటర్-3కి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మినీ క్వాలిఫయర్ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో టైటాన్స్ 37-32తేడాతో గెలిచి టోర్నీలో ముందడుగు వేసింది. బెంగళూరు గట్టిపోటీనిచ్చినప్పటికీ టైటాన్స్ స్పష్టమై ఆధిపత్యం ప్రదర్శించింది. ఆల్‌రౌండర్ భరత్, కెప్టెన్ విజయ్ మాలిక్ దూకుడు ప్రదర్శించారు. దీంతో ఏ దశలోనూ టైటాన్స్ వెనుకబడలేదు. ఫస్టాఫ్‌లో టైటాన్స్ 2 పాయింట్ల లీడ్ సాధించిన ఆ జట్టు సెకండాఫ్‌లోనూ 21-18తో పైచేయి సాధించి మొత్తంగా 5 పాయింట్ల తేడాతో గెలిచింది. టైటాన్స్ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఇంకా ఎలిమినేటర్ 3, క్వాలిఫయర్ 2 గండాలను దాటాల్సి ఉంది. మరోవైపు, జైపూర్ పింక్ పాంథర్స్‌ను పాట్నా పైరేట్స్ ఇంటికి పంపింది. ఎలిమినేటర్-1లో జైపూర్‌పై పాట్నా 48-32 తేడాతో నెగ్గి ఎలిమినేటర్-2కు చేరుకుంది. నేడు ఎలిమినేర్-2లో బెంగళూరుతో పాట్నా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఎలిమినేటర్-3లో టైటాన్స్‌ను ఎదుర్కొంటుంది.






