- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PKL 12 : తెలుగు టైటాన్స్ ఆశలు ఆవిరి.. క్వాలిఫయర్-2లో పరాజయం
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ టైటిల్ ఆశలు ఆవిరయ్యాయి.

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ టైటిల్ ఆశలు ఆవిరయ్యాయి. క్వాలిఫయర్-2లో బోల్తా పడి ఫైనల్‌కు అడుగు దూరంలో తమ పోరాటాన్ని ముగించింది. పుణేరి పల్టాన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 50-45 తేడాతో పుణేరి పల్టాన్ చేతిలో ఓడిపోయింది. ఇరు జట్లు పాయింట్ల కోసం హోరాహోరీగా పోటీపడ్డాయి. టైటాన్స్ తరపున భరత్ 23 పాయింట్లతో చెలరేగాడు. కెప్టెన్ విజయ్ కూడా 11 పాయింట్లు తెచ్చాడు. పుణేరి పల్టాన్ కూడా తగ్గలేదు. రైడర్ ఆదిత్య 22 పాయింట్స్‌తో ఆ జట్టు కీలకంగా వ్యవహరించాడు. టైటాన్స్ విజయం కోసం తీవ్రంగానే కష్టపడింది. ఫస్టాఫ్‌లో 4 పాయింట్స్(24-20) లీడ్ కూడా సాధించింది. కానీ, సెకండాఫ్‌లో పుణేరి పల్టాన్ బలంగా పుంజుకోవడంతో టైటాన్స్ తడబడింది. చివరికి 5 పాయింట్ల తేడాతో పరాజయం చవిచూసింది. దీంతో పుణేరి పల్టాన్ మూడోసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం దబాంగ్ ఢిల్లీ కే.సీ, పుణేరి పల్టాన్ జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది.






