యూపీ వారియర్స్‌కు గట్టి షాక్.. టోర్నీకి లిచ్‌ఫీల్డ్ దూరం

by Phanindra |

యూపీ వారియర్స్‌కు గట్టి షాక్ తగిలింది. గాయంతో లిచ్‌ఫీల్డ్ టోర్నీకి దూరమైంది.

యూపీ వారియర్స్‌కు గట్టి షాక్.. టోర్నీకి లిచ్‌ఫీల్డ్ దూరం
X

దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు ముందు యూపీ వారియర్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ టీం స్టార్ బ్యాటర్ ఫోబె లిచ్‌ఫీల్డ్ గాయం కారణంగా టోర్నీకి దూరమైంది. ఆ ఆసీస్ లెఫ్ట్ హ్యాండర్.. ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతోంది. ఆరు మ్యాచుల్లో 243 పరుగులతో యూపీ టీంలో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆరెంజ్ క్యాప్ లీడర్‌బోర్డులో మూడో స్థానంలో ఉన్న ఆమె.. యూపీ టీం బ్యాటింగ్ లైనప్‌లో కీలకంగా ఉంది. ఈ సీజన్‌లో 150పైగా స్ట్రైక్ రేటుతో ఆడుతున్న ఆమె.. రెండు హాఫ్ సెంచరీలతో మెరిసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న యూపీ.. ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యమే. అయితే మిగతా జట్ల ఫలితాలు అనుకూలంగా వచ్చి, మిగతా రెండు మ్యాచుల్లో గెలిస్తే యూపీకి అవకాశం ఉంటుంది. ఇలా చివరి రెండు మ్యాచుల్లో యూపీ తప్పక గెలవాల్సిన సమయంలో లిచ్‌ఫీల్డ్ వంటి ప్లేయర్ ఈ జట్టుకు చాలా అవసరం. ఈ కీలక టైంలో క్వాడ్ గాయం కారణంగా ఆమె టోర్నీ నుంచి తప్పుకోవడం కచ్చితంగా యూపీ వారియర్స్‌కు గట్టి దెబ్బే. ఆమె స్థానంలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ అమీ జోన్స్‌ను రిప్లేస్‌మెంట్‌గా తీసుకున్నట్లు యూపీ ఫ్రాంచైజీ ప్రకటించింది. ఆమె బేస్ ధర రూ.50 లక్షలకే అమీని తీసుకున్నట్లు తెలిపింది. 125 పైగా టీ20లు ఆడిన అమీ అనుభవం.. జట్టుకు ఉపయోగపడుతుందని ఆ టీం భావిస్తోంది.

Next Story