- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ 2025 ఫైనల్... RCB లోకి డేంజర్ ఆటగాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ ( IPL 2025) నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) జట్టుకు

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ ( IPL 2025) నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) జట్టుకు అదిరిపోయే శుభవార్త అందింది. బెంగళూరు జట్టులోకి విధ్వంసకర బ్యాటర్ వస్తున్నాడు. ఇవాళ ఫైనల్... మ్యాచ్ ఉన్న నేపథ్యంలో... ఫిల్ సాల్ట్ ( Phil Slat) మళ్లీ జట్టులోకి రాబోతున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్... బిడ్డకు జన్మనివ్వడంతో చూసేందుకు... బెంగళూరు జట్టును వదిలి యూకే కి వెళ్ళాడు ఫిల్ సాల్ట్. అయితే యూకేకు వెళ్లిన ఫిల్ సాల్ట్.. ఇవాళ ఉదయం మళ్లీ అహ్మదాబాద్ చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఫిల్ సాల్ట్... యూకే వెళ్లడంతో.. ఫైనల్ మ్యాచ్ ఆడడం అనుమానంగా మారిందని... సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది. క్వాలిఫైయర్ 1 లో ఫిల్ సాల్ట్ అదరగొట్టాడు. అలాంటి ప్లేయర్ బెంగళూరుకు దూరం అయితే చాలా కష్టం అయ్యేది. ఇలాంటి నేపథ్యంలోనే అందరికీ ఊరటనిస్తూ ఫిల్ సాల్ట్... తిరిగి అహ్మదాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే కచ్చితంగా బెంగళూరు ఫైనల్ లో విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఐపిఎల్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇవాళ రాత్రి 7:30 గంటలకు స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్ లో మొదటి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే ఛాన్సులు ఉన్నాయి.
🚨 GOOD NEWS FOR RCB FANS 🚨
— Tanuj (@ImTanujSingh) June 3, 2025
- Phil Salt is in Ahmedabad and He will be available for Today's IPL Final. pic.twitter.com/fZtiKWsrg0






