బాబర్, రిజ్వాన్, అఫ్రిదీ అవుట్.. టీ20 టీం ప్రకటించిన పీసీబీ

by Phanindra |

పాకిస్తాన్ టీ20 టీం నుంచి బాబర్, రిజ్వాన్, అఫ్రిదీ అవుట్. బంగ్లాదేశ్ సిరీసుకు ముగ్గురూ లేకుండానే టీం ప్రకటించిన పీసీబీ!

బాబర్, రిజ్వాన్, అఫ్రిదీ అవుట్.. టీ20 టీం ప్రకటించిన పీసీబీ
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌లో పర్యటించే టీ20 జట్టు నుంచి బాబర్ ఆజామ్, షహీన్ షా అఫ్రిదీ, మహమ్మద్ రిజ్వాన్‌లను తప్పించింది. ఈ సిరీస్ నుంచి న్యూజిల్యాండ్ మాజీ కోచ్ మైక్ హెసాన్ ఈ జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. మే 28న మొదలయ్యే ఈ మూడు మ్యాచుల టీ20 సిరీసులో సల్మాన్ అలీ అఘా.. పాకిస్తాన్‌కు సారధ్యం వహించనున్నాడు. కొన్నిరోజుల క్రితం న్యూజిల్యాండ్‌తో జరిగిన టీ20 సిరీసులో షహీన్ అఫ్రిదీ ఆడాడు. అయితే బాబర్, రిజ్వాన్‌ను ఆ సిరీస్‌కు కూడా పీసీబీ ఎంపిక చేయలేదు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా బంగ్లాదేశ్‌తో ఆడే టీ20 జట్టును ఎంపిక చేసినట్లు పీసీబీ ప్రకటించింది. దీంతో ఇక పొట్టి ఫార్మాట్లో బాబర్, రిజ్వాన్ శకం ముగిసిందనే ప్రచారం జరుగుతోంది.

పాకిస్తాన్ స్క్వాడ్: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రాఫ్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తాలట్, ఖుష్దిల్ షా, మహమ్మద్ హారిస్, మహమ్మద్ వసీం, మహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, షాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ ఆయుబ్.

Next Story