- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICC Champions Trophy : హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ రెడీ.. తాజా కండిషన్ ఇదే..!
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణలో పాకిస్తాన్ ఓ మెట్టు తగ్గినట్లు తెలుస్తోంది.

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణలో పాకిస్తాన్ ఓ మెట్టు తగ్గినట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించాలని లేని పక్షంలో టోర్నీని మరో దేశానికి తరలిస్తామని ఐసీసీ అల్టిమేటం విధించడంతో పాకిస్తాన్ హైబ్రిడ్ మోడల్‌పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ట్రోఫీలో హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ(పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఐసీసీ ముందు పీసీబీ మరో మెలిక పెట్టినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. 2031 వరకు జరిగే అన్ని ఐసీసీ ఈవెంట్లను హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించాలని పీసీబీ షరతు విధించినట్లు తెలిసింది. ఐసీసీ రానున్న రోజుల్లో మూడు కీలక ఈవెంట్లను భారత్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో ఈ కండిషన్ విధించినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లన్నింటిని తటస్థ వేదికలపైనే జరపాలని పీసీబీ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు సమాచారం.
ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు హెడ్‌తో పీసీబీ చైర్మన్ భేటీ
తాజా పరిణామాల నేపథ్యంలో పీసీబీ చైర్మన్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు హెడ్ ముబాషిర్ ఉస్మానీని దుబాయ్‌లో కలిశారు. ఉస్మానీ ఐసీసీ అసోసియేట్ మెంబర్లకు చైర్మన్‌గా సైతం వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్‌లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. మెగా ఈవెంట్‌లో అన్ని దేశాలు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఐసీసీ తమ షరతులకు ఓకే అంటేనే హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకారం తెలపనున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల దృష్ట్యా రెండు దేశాల ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు మరింత జఠిలం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు టోర్నీని నిర్వహించాలని తొలుత భావించారు. ఇందుకు కరాచీ, లాహోర్, రావల్పిండిలను వేదికలుగా నిర్ణయించారు. స్టేడియంలలో సౌకర్యాలను సైతం మెరుగుపరుస్తున్నారు. అయితే భారత్-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో టోర్నీ నిర్వహణ అంశం కొలిక్కొ రాలేదు. పీసీబీ తాజా ప్రతిపాదనపై ఐసీసీ ఎలా స్పందిస్తుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.






