అర్ష్​ దీప్​ కు ఊహించ‌ని షాక్‌...ఐసీసీ ద‌గ్గ‌ర‌కు పంచాయితీ !

by velandi.Saikiran |

అర్ష్‌దీప్ సింగ్ ను టార్గెట్ చేసింది పాకిస్థాన్‌. దీంతో అత‌నిపై ఫిర్యాదు చేసేందుకు రిపోర్టు సిద్ధం చేస్తోంద‌ట పీసీబీ

అర్ష్​ దీప్​ కు ఊహించ‌ని షాక్‌...ఐసీసీ ద‌గ్గ‌ర‌కు పంచాయితీ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీమిండియా స్టార్ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అతనిపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. హరీస్ ర‌వూఫ్ చేసిన సైగ‌ల‌కు అర్ష్‌దీప్ సింగ్ కౌంట‌ర్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ త‌రుణంలోనే... అర్ష్‌దీప్ సింగ్ ను టార్గెట్ చేసింది పాకిస్థాన్‌. దీంతో అత‌నిపై ఫిర్యాదు చేసేందుకు రిపోర్టు సిద్ధం చేస్తోంద‌ట పీసీబీ.

అస‌లేం జ‌రిగిందంటే ?

ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో భాగంగా టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య సూప‌ర్ 4 మ్యాచ్ జ‌రిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ ఫోర్ గేట్ ద‌గ్గ‌ర హ‌రీస్ ర‌వూఫ్ ఓవ‌ర్ గా రియాక్ట్ అయ్యాడు. ఇండియా పంపిన 6 జెట్స్ ను కూల్చేశామ‌ని.. భార‌త‌ ఫ్యాన్స్ ను చూస్తూ సైగ‌లు చేశాడు. ఈ వీడియో వైర‌ల్ అయింది. అయితే.. పాక్ బౌల‌ర్ ర‌వూఫ్ కు కౌంట‌ర్ ఇచ్చేందుకు అర్ష్‌దీప్ సింగ్ డిఫ‌రెంట్ గా ప్ర‌య‌త్నించాడు. మీ పాక్ జెట్స్ ను మ‌డిచి పొట్టుకోండి అంటూ సైగ‌లు చేసి.. కౌంట‌ర్ ఇచ్చాడు అర్ష్‌దీప్ సింగ్. దీంతో... ర‌వూఫ్‌, పాక్ ప‌రువు మొత్తం పోయింది.ఈ త‌రుణంలోనే.. అర్ష్‌దీప్ సింగ్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

Next Story