- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూల్స్ బ్రేక్ చెయ్యలేదు.. అంపైర్‌తో మీటింగ్‌ను వీడియో తీయడంపై పీసీబీ
అంపైర్‌తో మీటింగ్‌ను వీడియో తీయడంపై పీసీబీ వివరణనిచ్చింది. తాము ఎలాంటి రూల్స్ బ్రేక్ చెయ్యలేదంటూ ఐసీసీకి తెలియజేసింది.

దిశ, స్పోర్ట్స్: ఆసియా కప్‌లో ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించారని వస్తున్న ఆరోపణలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఖండించింది. అంపైర్ ఆండీ పైక్రాఫ్ట్‌తో టీం అఫీషియల్స్ సమావేశాన్ని పీసీబీ మీడియా మేనేజర్ రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది నిబంధనలు విరుద్ధమంటూ ప్రచారం జరగ్గా.. తాము ఐసీసీ నియమాలకు కట్టుబడే ఇలా చేశామని పీసీబీ తెలిపింది. ఆండీ పైక్రాఫ్ట్‌తో పీసీబీ అధికారుల మీటింగ్‌లో ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (పీఎంఓఏ) నిబంధనలను ఉల్లంఘించారంటూ పీసీబీకి ఐసీసీ సీఈవో సంజోక్ గుప్తా లేఖ రాశారు.
అలాగే పైక్రాఫ్ట్ తమకు క్షమాపణ చెప్పాడంటూ పీసీబీ ప్రకటించడాన్ని కూడా ఐసీసీ తప్పుబట్టింది. ఏసీసీ వెన్యూ మేనేజర్ వల్ల జరిగిన మిస్‌కమ్యూనికేషన్‌కు మాత్రమే ఆయన సారీ చెప్పాడని ఐసీసీ పేర్కొంది. అయితే పీఎంఓఏ నిబంధనల ప్రకారం మీడియా మేనేజర్ కూడా ఆ ప్రాంతంలో ఉండొచ్చని, కెమెరా వాడొచ్చని పీసీబీ తెలిపిందట. తాము రూల్స్ పాటించకపోతే, ఆ విషయాన్ని ఏసీయూకు మ్యాచ్ రిఫరీ రిపోర్ట్ చేశాడేమో అడగాలని పీసీబీ వర్గాలు ఐసీసీకి బదులిచ్చినట్లు తెలుస్తోంది.






