కమిన్స్, హెడ్‌లకు భారీ ఆఫర్ ఇచ్చిన ఐపీఎల్ ఫ్రాంచైజీ.. ఏడాదికి ఏకంగా రూ.58 కోట్లు.. షరతులు వర్తిస్తాయి.

by Harish |

ఆస్ట్రేలియా టాప్ ప్లేయర్లు పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్‌లకు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీ ఆఫర్ ఇచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

కమిన్స్, హెడ్‌లకు భారీ ఆఫర్ ఇచ్చిన ఐపీఎల్ ఫ్రాంచైజీ.. ఏడాదికి ఏకంగా రూ.58 కోట్లు.. షరతులు వర్తిస్తాయి.
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా టాప్ ప్లేయర్లు పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్‌లకు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీ ఆఫర్ ఇచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏడాదికి చెరో రూ. 58 కోట్లు ఇవ్వడానికి సదరు ఫ్రాంచైజీ సిద్ధపడందని, అయితే ఓ షరత్ పెట్టినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగుల్లో తమ ఫ్రాంచైజీ తరపున ఆడాలని కండీషన్ పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే, ఆ ఆఫర్‌ను కమిన్స్, హెడ్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఆ ఫ్రాంచైజీ ఏది అన్నది తెలియదు. కమిన్స్, హెడ్ స్పందిస్తేనే ఈ వార్తలు పుకార్లా? నిజమా? అన్నది క్లారిటీ వస్తుంది.

ఐపీఎల్‌లో వారిద్దరూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్)కు ఆడుతున్న విషయం తెలిసిందే. ఎస్‌ఆర్‌‌హెచ్ కెప్టెన్‌గా ఉన్న కమిన్స్‌ను ఆ ఫ్రాంచైజీ రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది. హెడ్‌కు రూ.14 కోట్లు చెల్లిస్తోంది. కమిన్స్, హెడ్ క్రికెట్ ఆస్ట్రేలియాతో కాంట్రాక్ట్ రూపంలో చోరో రూ.8.70 కోట్ల వరకు పొందుతున్నారు. అయితే, ఆస్ట్రేలియా కెప్టెన్‌గా కమిన్స్ అన్నీ కలుపుకుని ఏడాదికి రూ.17.50 కోట్ల వరకు అందుకుంటున్నాడు. మొత్తం కలుపుకుని కమిన్స్ రూ. 35‌కోట్లకుపైగానే ఆర్జిస్తున్నారు. హెడ్ రూ.25 నుంచి 30 కోట్ల వరకు అందుకుంటున్నాడు.


Next Story