ఇండియా సిరీస్‌కు కమిన్స్ దూరం! వెన్నుగాయంతో యాషెస్ వరకు రెస్ట్

by Phanindra |

వెన్నుగాయంతో యాషెస్ వరకు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ రెస్ట్ తీసుకోనున్నాడు. అంటే ఇండియా సిరీస్‌కు కమిన్స్ దూరం అవుతున్నాడన్నమాట.

ఇండియా సిరీస్‌కు కమిన్స్ దూరం! వెన్నుగాయంతో యాషెస్ వరకు రెస్ట్
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియాతో జరిగే వన్డే సిరీస్‌కు ఆసీస్ టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరమవుతున్నాడు. ఈ ఏడాది చివర్లో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ఆసీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సిరీస్ నేపథ్యంలో ప్యాట్ కమిన్స్‌ను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇలాంటి సమయంలో తాజాగా చేసిన రొటీన్ అసెస్‌మెంట్‌లో కమిన్స్ వీపులో లంబర్ బోన్ స్ట్రెస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

స్కానింగ్‌ తీస్తే ఎముకలో ఎలాంటి చీలికలు లేవని, అయితే ఈ స్ట్రెస్ తగ్గడానికి కూడా విశ్రాంతి కావాలని వైద్యులు చెప్పారట. ఈ క్రమంలో న్యూజిల్యాండ్, భారత్‌తో ఆస్ట్రేలియా ఆడాల్సిన వన్డే సిరీసులకు కమిన్స్‌ను దూరం పెట్టి, యాషెస్ సమయానికి అతను కోలుకునేలా సీఏ ప్లాన్ చేస్తోంది. ఒకవేళ ఆ సమయానికి కూడా కమిన్స్ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోతే అతని స్థానంలో స్కాట్ బోలాండ్‌ను ఆడించనున్నారని సమాచారం.

Next Story