- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SRH: పండుగ పూట సన్ రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
ఐపీఎల్ 2025 ఈ నెల 22 నుంచి గ్రాండ్ గా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న కీలక నాలుగు జట్ల ప్లేయర్లు ఒక్కొక్కరుగా వారి వారి జట్లలో చేరుకుంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2025 ఈ నెల 22 నుంచి గ్రాండ్ గా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) లో పాల్గొన్న కీలక నాలుగు జట్ల ప్లేయర్లు ఒక్కొక్కరుగా వారి వారి జట్లలో చేరుకుంటున్నారు. అయితే ఈ సీజన్ లో క్రికెట్ అభిమానులందరూ సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు పర్ఫార్మెన్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత సీజన్లో భీకరమైన బ్యాటింగ్ తో ప్రత్యర్థి జట్లకు వణుకుపుట్టించిన హైదరాబాద్ జట్టు ప్లేయర్లు అందరూ దాదాపు వారే ఉండటంతో ఈ సీజన్ లో SRH పై భారీ ఆశలు ఉన్నాయి. కాగా గత సీజన్లో హైదరాబాద్ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లిన పాట్ కమ్మిన్స్ (Pat Cummins) ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయం కారణంగా కీలక ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. దీంతో ఎస్ఆర్‌హెచ్ అభిమానుల్లో (SRH fans) తీవ్ర ఆందోళన నెలకొంది. గత సీజన్లో తమ జట్టును ఫైనల్ చేర్చిన కెప్టెన్ కమ్మిన్స్ గాయం నుంచి కోలుకొని ఈ సీజన్ కు అందుబాటులోకి వస్తాడో లేదో అనుమానం హైదరాబాద్ అభిమానుల్లో నెలకొంది. అయితే కొన్ని రిపోర్టులు పాట్ కమ్మిన్స్ మొదటి రెండు మ్యాచులకు అందుబాటులో ఉండడని తెలిపాయి.
కాగా అలాంటి వార్తలకు జట్టు యాజమాన్యం చెక్ పెట్టింది. గాయం నుంచి కోలుకున్న పాట్ కమ్మిన్స్ (Pat Cummins) ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించారు. ఆస్ట్రేలియా బోర్డు వద్ద పర్మిషన్ తీసుకుని మరో రెండు రోజుల్లో కమ్మిన్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరనున్నాడు. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ.. SRH సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో కెప్టెన్ ఈస్ బ్యాక్ (The Captain is Back) అంటూ పోస్టులు పెట్టారు. దీంతో ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే గత సీజన్ లో రెచ్చిపోయిన అభిషేక్, ట్రావిస్ హెడ్, క్లాస్, నితీష్ కుమార్ రెడ్డిలకు తోడుగా.. ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్ వంటి యువ హిట్టర్లను జట్టులోకి తీసుకుంది. దీంతో ఈ సీజన్ లో SRH జట్టు 300 స్కోరును దాటుతుందని.. అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. మరి అభిమానుల అంచనాలను హైదరాబాద్ జట్టు అందుకుంటుందో లేదో తెలియాలంటే ఈ సీజన్ ఎండ్ వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే SRH జట్టు ఈ సీజన్ లో మొదట మ్యాచ్ ను ఈ నెల 23న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఆడనుంది.






