యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ !

by velandi.Saikiran |

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ జట్టుకు దూరం కాబోతున్నాడు. మిగిలిన రెండు టెస్టుల్లో

యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: యాషెస్‌ సిరీస్ 2025-26 టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ జట్టుకు దూరం కాబోతున్నాడు. మిగిలిన రెండు టెస్టుల్లో పాట్ కమ్మిన్స్ ఆడబోడని తెలుస్తోంది. ఇప్పటికే యాషెస్‌ సిరీస్ గెలిచిన నేపథ్యంలో పాట్ కమ్మిన్స్ రెస్ట్ ఇవ్వాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో పాట్ కమ్మిన్స్ స్థానంలో మరోసారి స్టీవెన్ స్మిత్ కెప్టెన్సీ బాధ్యతలు వహించనున్నాడు.

ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. ఇది ఇలా ఉండగా యాషెస్‌ సిరీస్ 2025-26 టైటిల్ ఇప్పటికే ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటు నేపథ్యంలో ఐదు టెస్టులు జరగాల్సి ఉంది. కానీ వరుసగా మూడు టెస్టుల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా, 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక డిసెంబర్ 26వ తేదీన నాలుగో టెస్ట్ మెల్ బోర్న్ వేదికగా జరగనుంది. చిట్ట చివరి టెస్టు జనవరి 4వ తేదీన సిడ్ని వేదికగా నిర్వహిస్తారు.

Next Story