స్వదేశానికి ప్యాట్ కమ్మిన్స్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?

by Disha Web Desk 1 |
స్వదేశానికి ప్యాట్ కమ్మిన్స్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఎప్పటిలాగానే ఆస్ట్రేలియా భారత్ జట్లు హోరాహోరీగా తలబడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో ఉండగా.. ఇక స్వదేశీ పరిస్థితులను ఎంతో అద్భుతంగా వినియోగించుకున్న భారత జట్టు వరుస విజయాలు సాధిస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టాలి అంటే తప్పక గెలవాల్సిన సిరీస్ కావడంతో టీమిండియా ఎక్కడ తప్పు చేయకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.

ముఖ్యంగా భారత బౌలింగ్ విభాగం అయితే అసమాన్యమైన ప్రదర్శనతో తిరుగులేదు అని నిరూపిస్తూ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లకు ముచ్చెమటలు పట్టిస్తుంది. ఇకపోతే ఆస్ట్రేలియా భారత్ మధ్య ఇప్పటి వరకు రెండు టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో 132 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న టీమిండియా.. ఇక రెండో టెస్ట్ లోనూ అదే జోరు కొనసాగించింది. ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయ డంకా మోగించింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టు కనీసం మిగతా రెండు మ్యాచ్లు అయినా గెలుస్తుందా లేదా అనే విషయంపై చర్చ మొదలైంది.

ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా జట్టులో అనూహ్యమైన మార్పు జరగబోతుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ గా ఉన్న ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం వ్యక్తిగత కారణాల వల్ల ఇండియా పర్యటనను వదిలిపెట్టి స్వదేశానికి వెళ్లబోతున్నాడు. కాగా, మూడో టెస్ట్ మార్చి 1న ప్రారంభం కానుంది. ఇక అప్పటివరకు అటు ప్యాట్ కమిన్స్ మళ్లీ జట్టుతో చేరతాడో లేదో సందేహామే. దీంతో మిగిలిన రెండు టెస్టులకు కూడా స్మిత్ కెప్టెన్ గా వహించబోతున్నట్లు సమాచారం. అయితే, వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనమైన కమ్మిన్స్ తిరిగొచ్చేది అనుమానమే.

Next Story

Most Viewed