ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టీమ్ నూతన కెప్టెన్‌గా కైలియన్ ఎంబాపె..

by Vinod kumar |

ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టీమ్ నూతన కెప్టెన్‌గా కైలియన్ ఎంబాపె..
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టీమ్ నూతన కెప్టెన్‌గా పారిస్ సెయింట్ జర్మైన్ క్లబ్ ప్లేయర్ కైలియన్ ఎంబాపె ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రెంచ్ పత్రిక వెల్లడించింది. ఫ్రాన్స్ కెప్టెన్‌గా ఉన్న లోరిస్ 2022 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అర్జెంటీనా చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో జనవరి నుంచి ఫ్రాన్స్ కెప్టెన్ స్థానం ఖాళీగా ఉంది. మరోవైపు ఫ్రాన్స్ టీమ్‌కు వైస్ కెప్టెన్ ఎంపికలో ఆంటోనియో గ్రెజిమెన్ ఎన్నికయ్యాడు. కెప్టెన్‌గా ఎన్నికైన ఎంబాపె.. 66 మ్యాచ్‌లో ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో హాట్రిక్ గోల్స్ చేసిన్నప్పటికీ ఫ్రాన్స్ గెలవలేకపోయింది. 2018 వరల్డ్ కప్ సాధించడంతో కీలక పాత్ర పోషించాడు.

Next Story