Paris Paralympics: భారత్ ఖాతాలో మరో రజతం! 21 కి చేరిన పతకాల సంఖ్య

by Geesa Chandu |
Paris Paralympics: భారత్ ఖాతాలో మరో రజతం! 21 కి చేరిన పతకాల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్: పారిస్ పారాలింపిక్స్(Paris Paralimpics) లో.. భారత్ పతకాల జోరు కొనసాగిస్తోంది. బుధవారం(September 4) భారత పారాథ్లెట్ సచిన్ సర్జేరావు ఖిలారీ(Sachin Sarjerao Khilari) సంచలనం సృష్టించాడు. పురుషుల షాట్ పుట్(F-46) లో సచిన్ ఖిలారి(16.32 మీ.) రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. ప్రస్తుత పారాలింపిక్స్ లో.. భారత్ కు ఇది 21 వ పతకం. కాగా భారత్ ఇప్పటివరకు 3 స్వర్ణాలు(Gold), 7 రజతాలు(Silver), 11 కాంస్య పతకాలు సాధించింది. సచిన్ ఖిలారి.. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తన రెండో ప్రయత్నంలో 16.32 మీటర్లు విసిరాడు. అయితే ఈ ఈవెంట్ లో కెనడాకు చెందిన గ్రెగ్ స్టీవర్ట్ 16.38 మీటర్లు విసిరి బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. క్రొయేషియాకు చెందిన బకోవిచ్ లుకా 16.27 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని(Bronze) గెలుచుకున్నాడు.



Next Story

Most Viewed