పారా ఒలింపిక్స్.. బ్యాడ్మింటన్ లో భారత్ కు పతకం ఖాయం!

by Geesa Chandu |

పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు అదరగొడుతున్నారు.

పారా ఒలింపిక్స్.. బ్యాడ్మింటన్ లో భారత్ కు పతకం ఖాయం!
X

దిశ, వెబ్ డెస్క్: పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. సుకాంత్ కదం, సుహాస్ యతిరాజ్ లు ఇద్దరూ.. ఎస్ఎల్-4 విభాగంలో సెమీ ఫైనల్ కు చేరుకొని భారత్ కు పతకాన్ని ఖాయం చేశారు. ఈ ఇద్దరు షట్లర్లు పురుషుల సింగిల్స్ ఎస్ఎల్-4 విభాగంలో సెమీస్ లో పోటీపడనున్నారు. దీంట్లో గెలిచినవారు ఫైనల్ కు వెళ్తారు. ఈ ఫైనల్ లో వీరికి స్వర్ణం కానీ రజతం కానీ ఖాయంగా కనిపిస్తోంది. అయితే సెమీస్ లో ఓడిపోయిన ప్లేయర్ మూడవ స్థానం కొరకు కాంస్య పతక పోరుకు సిద్ధం కావలసి ఉంటుంది. దీన్ని బట్టి పారిస్ పారా ఒలింపిక్స్ లో.. భారత్ కు మరో రెండు పతకాలు కూడా ఖాయంగానే కనిపిస్తోంది.

Next Story