- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > ఆసియా చాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన పారా ఆర్చర్ హర్విందర్.. రెండు బంగారు పతకాలు కైవసం
ఆసియా చాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన పారా ఆర్చర్ హర్విందర్.. రెండు బంగారు పతకాలు కైవసం
పారా ఆర్చరీ ఏసియన్ చాంపియన్‌షిప్‌లో పారిస్ పారాలింపిక్స్ చాంపియన్, భారత పారా ఆర్చర్ హర్విందర్ సింగ్ అదరగొట్టాడు.

X
దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరిగిన పారా ఆర్చరీ ఏసియన్ చాంపియన్‌షిప్‌లో పారిస్ పారాలింపిక్స్ చాంపియన్, భారత పారా ఆర్చర్ హర్విందర్ సింగ్ అదరగొట్టాడు. రికర్వ్ విభాగంలో మూడు కేటగిరీల్లోనూ పతకం సాధించాడు. అందులో రెండు బంగారు పతకాలు ఉండటం విశేషం. ఆదివారం రికర్వ్ ఓపెన్ ఫైనల్‌లో హర్విందర్ 7-1తో థాయిలాండ్‌కు చెందిన నెట్‌సిరి హన్రేచైని ఓడించాడు. దీంతో ఆసియా పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత విభాగంలో తొలి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. మిక్స్‌డ్ రికర్వ్ విభాగంలో భావనతో కలిసి హర్విందర్ స్వర్ణం గెలిచాడు. అలాగే, పురుషుల రికర్వ్ టీమ్‌లో వివేక్ చికారతో కలిసి రజతం సాధించాడు. ఈ టోర్నీలో భారత్ మొత్తం 9 పతకాలు సాధించింది. అందులో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి.
Next Story






