- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సస్పెన్స్‌కు తెర.. త్వరలోనే స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి!
టీమ్ ఇండియా వుమెన్స్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ కంపోజర్ పలాష్ మచ్చల్ తో స్మృతి మంధాన పెళ్లి కుదిరింది. కానీ స్మృతి మంధాన తండ్రి అనారోగ్యం కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్నట్టు ముందుగా మంధానా మేనేజర్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: టీమ్ ఇండియా వుమెన్స్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌తో స్మృతి మంధాన పెళ్లి కుదిరింది. కానీ స్మృతి మంధాన తండ్రి అనారోగ్యం కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్నట్టు ముందుగా మంధాన మేనేజర్ ప్రకటించారు. కానీ తరవాత స్మృతి తన సోషల్ మీడియా అకౌంట్ నుండి పలాష్‌తో దిగిన ఫోటోలు అన్నింటినీ డిలీట్ చేసింది. దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే పలాష్ ముచ్చల్ ఓ యువతితో చేసిన చాటింగ్ లీక్ అయ్యింది.
అందులో పలాష్ రాసలీలలు బయటపడటం దుమారం రేపింది. పలాష్ చాటింగ్ బయటపడటం వల్లనే వీరిద్దరి పెళ్లి ఆగిపోయిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు స్మృతి మంధాన స్పందిచలేదు. దీంతో పెళ్లికి పూర్తిగా బ్రేక్ పడిందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా పలాష్ తల్లి అమిత కీలక ప్రకటన చేసింది. త్వరలోనే స్మృతి మంధనా పలాష్ ముచ్చల్ వివాహం జరగబోతుందని ప్రకటించింది. స్మృతికి వెల్ కమ్ చెప్పేందుకు ప్రత్యేక ఏర్పాట్లను సైతం చేశామని వెల్లడించింది.






