సూపర్ 4 లో టీమిండియాతో మ్యాచ్... పాకిస్తాన్ షాకింగ్ నిర్ణయం !

by velandi.Saikiran |

రిఫ‌రీ ఆండీని త‌ప్పించే వ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌బోద‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్ప‌ష్టం చేస్తోంద‌ట‌

సూపర్ 4 లో టీమిండియాతో మ్యాచ్... పాకిస్తాన్ షాకింగ్ నిర్ణయం !
X

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా క‌ప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ జ‌ట్ల బిగ్ ఫైట్ జ‌రుగ‌నుంది. ఇప్ప‌టికే గ్రూప్ స్టేజ్ లో ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. మ‌రోసారి సూప‌ర్ 4 లో మ్యాచ్ జ‌రుగ‌నుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబ‌ర్ 21వ తేదీన పాకిస్థాన్‌, టీమిండియా మ్యాచ్ ఉండ‌నుంది. అయితే.. ఈ మ్యాచ్ ఆడ‌కుండా యూఏఈతో చేసిన‌ట్లు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

రిఫ‌రీ ఆండీని త‌ప్పించే వ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌బోద‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్ప‌ష్టం చేస్తోంద‌ట‌. టీమిండియాతో మ్యాచ్ కాబ‌ట్టి.. ఆ ప్లేయ‌ర్లు అంద‌రూ షేక్ హ్యాండ్ ఇవ్వాల‌ని.. మొన్న‌టి లాగా వ్య‌వ‌హ‌రిస్తే..బాయ్ కాట్ చేస్తామ‌ని పీసీబీ స్ప‌ష్టం చేస్తోంద‌ట‌. ఈ రెండు డిమాండ్స్ ప‌రిష్క‌రిస్తేనే.. సూప‌ర్ 4 ఆడ‌తామ‌ని ఐసీసీని మ‌రోసారి పాకిస్థాన్ బెదిరిస్తోన్న‌ట్లు స‌మాచారం. అయితే.. పాకిస్థాన్ బెదిరింపుల‌కు ఐసీసీ బెదిరిపోద‌ని.. యూఏఈ మ్యాచ్ తోనే స్ప‌ష్టం అయింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

Next Story