- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్స్.. హాట్ టాపిక్‌గా పాకిస్తాన్ పేరు
ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) సమీపిస్తోన్న బీసీసీఐ(BCCI) కొత్త జెర్సీని విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) సమీపిస్తోన్న బీసీసీఐ(BCCI) కొత్త జెర్సీని విడుదల చేసింది. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ(Captain Rohit Sharma), విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, శుభ్‌మన్ గిల్‌లు ఈ కొత్త జెర్సీలు ధరించి కెమెరాలకు ఫోజులిచ్చారు. అయితే ఈ జెర్సీపై ఆతిథ్య పాకిస్తాన్(Pakistan) పేరును ముద్రించడం హాట్ టాపిక్‌గా మారింది. చాలా రోజుల తర్వాత ఐసీసీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తుండటం తెలిసిందే. దీంతో జెర్సీపై 'ఛాంపియన్స్ ట్రోఫీ 2025, పాకిస్తా్న్' అని ముద్రించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy 2025) బుధవారం నుంచి ప్రారంభం కానుంది. పాకిస్తాన్ హోస్ట్(Host Pakistan)గా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భారత జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో ఐసీసీ టీమిండియా ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 19న పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ స్టార్ట్ అవుతోంది.
భారత జట్టు :
కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా.
These pics from today 📸
— BCCI (@BCCI) February 17, 2025
How good 🤌🏻#TeamIndia | #ChampionsTrophy pic.twitter.com/yM50ArMIj5






