- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీమిండియా విజయం..పాకిస్తాన్ ఫ్యాన్స్ సంబరాలు చూడండి
టీమిండియా ఛాంపియన్ గా నిలిస్తే, ప్రత్యర్థి పాకిస్తాన్ అభిమాని కూడా సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది

దిశ, వెబ్ డెస్క్: వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి, ఈ క్షణం కోసం చాలా ఎదురు చూసింది టీమిండియా. అయితే నవంబర్ రెండో తేదీన దక్షిణాఫ్రికాపై ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి, తొలిసారిగా ఛాంపియన్ గా నిలిచింది మహిళల టీమిండియా టీం. ఏకంగా 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఛాంపియన్ గా అవతరించింది హర్మన్ ప్రీత్ కౌర్ టీం. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు టీమిండియా అభిమానులు.
అయితే మన టీమిండియా ఛాంపియన్ గా నిలిస్తే, ప్రత్యర్థి పాకిస్తాన్ అభిమాని కూడా సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అర్షద్ ముహమ్మద్ హనీఫ్ అనే పాకిస్తాన్ అభిమాని, మన టీమిండియా మహిళల జట్టు ఛాంపియన్ గా నిలిచిన రోజు తన ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు భారత జాతీయ గీతం పాడి, టీమిండియా విజయం సాధించిన తర్వాత కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందులో హనీఫ్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు. క్లిక్






