- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్ క్రికెటర్ ఫర్హాన్ ఓవరాక్షన్.. టీమిండియా ఫ్యాన్స్ ఫైర్
ఆసియా కప్(Asia Cup 2025) సూపర్ ఫోర్‌లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్(India vs Pakistan) మధ్య మ్యాచ్ జరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్(Asia Cup 2025) సూపర్ ఫోర్‌లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్(India vs Pakistan) మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో ముందుగా పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది. తాజాగా పాక్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 171 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ (58) అర్ధశతకంతో రాణించాడు. ఫఖర్ జమాన్ (15), సైమ్ అయూబ్ (21), నవాజ్ (21), ఫహీమ్ అష్రఫ్ (20), సల్మాన్ (17) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో శివమ్ దూబె 2 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, కుల్‌దీప్ చెరో వికెట్ తీశారు. ఇదిలా ఉంటే.. హాఫ్ సెంచరీ అనంతరం ఫర్హాన్(Sahibzada Farhan) చేసిన సెలబ్రేషన్స్ విదాస్పదంగా మారాయి. బ్యాట్‌తో గన్ ఫైరింగ్ చేస్తున్నట్లు ఓవరాక్షన్ చేశాడు. దీంతో ఫర్హాన్ తీరుపై భారత అభిమానులు మండిపడుతున్నారు. రెండు దేశాల మధ్య పరిస్థితి బాగోలేనప్పుడు ఇలాంటి అత్యుత్సాహపు సెలబ్రేషన్స్ చేసుకోవడం మంచి పద్దతి కాదని సీనియర్ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా ఫర్హాన్ తీరును తప్పుబడుతున్నారు.






