Iran-Israel War: పెను ప్ర‌మాదంలో పాకిస్తాన్ జ‌ట్టు

by velandi.Saikiran |

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ మహిళల జట్టు దక్షిణాఫ్రికాలోనే ఇరుక్కుంది.

Iran-Israel War: పెను ప్ర‌మాదంలో పాకిస్తాన్ జ‌ట్టు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ ( Iran-Israel War) మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు రోజుల నుంచి ఈ యుద్ధం కొనసాగుతోంది. ఎవరు కూడా తగ్గడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలు కలిసి ఇరాన్ ను టార్గెట్ చేశాయి. ఇరాన్ అధి నాయకత్వాన్ని దాదాపు మటాష్ చేసింది అమెరికా. అయితే ఇజ్రాయెల్, అమెరికా దాడులకు కౌంటర్ గా గల్ఫ్ దేశాలపై ( Middle East Flight Disruptions) అటాక్ చేస్తోంది ఇరాన్. ఇందులో భాగంగానే దుబాయ్ విమానాశ్రయం దగ్గర భారీ పేలుడు కూడా సంభవించింది. దీంతో దుబాయ్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని విమానాశ్రయాలు దాదాపు మూసివేశారు.

పెను ప్ర‌మాదంలో పాకిస్తాన్ జ‌ట్టు

ఇప్పుడిప్పుడే కొన్ని విమానాలు ఎగురుతున్నాయి. అయితే ఈ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ మహిళల జట్టు ( Pakistan Women’s Cricket Team) దక్షిణాఫ్రికాలోనే ( South Africa ) ఇరుక్కుంది. టీ20 లు, వన్డే సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికాలో ఫిబ్రవరి మొదటి వారంలో పర్యటించింది పాకిస్తాన్ మహిళల జట్టు. మార్చి 1వ తేదీతో ఈ టూర్ ఫినిష్ అయింది. రెండవ తేదీన దుబాయ్ నుంచి పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉంది మహిళల జట్టు. కానీ ప్రస్తుతం యుద్ధం కారణంగా దుబాయ్ నుంచి విమానాలు ఎగరడం లేదు. దీంతో దక్షిణాఫ్రికాలోని డర్బన్ లోనే పాకిస్తాన్ మహిళల జట్టు ఇరుక్కుంది. మరో మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కు మహిళల జ‌ట్టును చేర్చే బాధ్యత దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Next Story