పాకిస్తాన్ యూ-ట‌ర్న్‌..ఐసీసీ ముందు కొత్తగా కండీష‌న్స్ !

by velandi.Saikiran |   (  Updated:2026-02-02 15:45:00  IST  )

ఇది ఇలా ఉండ‌గా టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుండ‌గా, మార్చి 8వ తేదీన ముగియ‌నుంది.

పాకిస్తాన్ యూ-ట‌ర్న్‌..ఐసీసీ ముందు కొత్తగా కండీష‌న్స్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ మరో 4 రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త కండిషన్స్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు అసలు ఈ టోర్నమెంట్ ఆడబోమని మెసేజ్ పంపిన పాకిస్తాన్, ఇప్పుడు ఇండియాతో మ్యాచ్ వద్దు బాబోయ్ అంటోంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన అంటే ఇదే నెలలో లీగ్ స్టేజ్ లో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో షెడ్యూల్ ప్రకారం అన్ని మ్యాచ్ లు ఆడతామని పేర్కొన్న పాకిస్తాన్, కేవలం భారత్ తో జరిగే మ్యాచ్ బాయ్ కాట్‌ చేస్తామని వెల్లడించింది. దీంతో తీవ్ర గందర గోళ‌ పరిస్థితి నెలకొంది.

ఐసీసీ ముందు కొత్త కండిషన్లు

ఇండియాతో మ్యాచ్ ఆడబోమని పేర్కొన్న పాకిస్తాన్ కు ఐసీసీ ( ICC) కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. క్రీడా స్ఫూర్తిని దెబ్బతీయకుండా ఖచ్చితంగా పాకిస్తాన్ ఆడాల్సిందేనని వెల్లడించింది ఐసీసీ. అలా కాదని ఓవర్ చేస్తే, కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. అయితే, ఎలాగైనా నష్టం జరుగుతుందని భావించిన పాకిస్తాన్, ఇప్పుడు కొత్త కండిషన్లు పెడుతోందట. బంగ్లాదేశ్ పెట్టిన డిమాండ్లను ఇప్పుడైనా పరిష్కరించి, మళ్లీ వాళ్లకు అవకాశం ఇవ్వాలని గొంతెమ్మ కోరికలు కోరుతోందట పాకిస్తాన్. వాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, కచ్చితంగా ఇండియాతో మ్యాచ్ ఆడతామని పాకిస్తాన్ కు చెందిన కొంత మంది వెల్లడిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కండిషన్స్ నేపథ్యంలో ఐసీసీ ఇంకా స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే మాత్రం, కండిషన్లను రిజెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండ‌గా టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుండ‌గా, మార్చి 8వ తేదీన ముగియ‌నుంది. ఇక ఈ టోర్న‌మెంట్ ను శ్రీలంక‌, భార‌త్ వేదిక‌గా నిర్వ‌హించ‌నున్నారు.

Next Story