బంగ్లాదేశ్ బాట‌లోనే పాకిస్తాన్ బాయ్ కాట్..క్లారిటీ ఇచ్చిన PCB

by velandi.Saikiran |

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ఆదివారం తమ జట్టును కూడా ప్రకటించబోతున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించిందట.

బంగ్లాదేశ్ బాట‌లోనే పాకిస్తాన్ బాయ్ కాట్..క్లారిటీ ఇచ్చిన PCB
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్ 2026 నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండియాతో గొడవల కారణంగా బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు సమాచారం కూడా ఇచ్చింది బంగ్లాదేశ్. అయితే ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఇదే బాటలో నడవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ సర్కార్ నుంచి ఆడకూడదని ఆదేశాలు వస్తే, టి20 ప్రపంచ కప్ నుంచి తప్పుకుంటామని ఆలోచన చేస్తున్నారట. దీంతో పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ బాటలోనే నడవబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగింది.

క్లారిటీ ఇచ్చిన PCB

రూమ‌ర్లు వ‌స్తోన్న ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ఆదివారం తమ జట్టును కూడా ప్రకటించబోతున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించిందట. ఈ ప్రకటనతో రూమర్లకు చెక్ పడింది. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పాకిస్తాన్ భాగస్వామ్యం కాబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది.

బంగ్లాదేశ్ స్థానంలో ఏ దేశం రంగంలోకి దిగబోతుందంటే ?

ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐసీసీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా బంగ్లాదేశ్ దిగి రాలేదు. ఇండియాలో పర్యటించబోమని, టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. దీంతో బరిలోకి 21వ క్రికెట్ జట్టుగా స్కాట్లాండ్ రాబోతున్నట్లు సమాచారం అందుతోంది.

Next Story