- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ కథ ముగిసింది. సూపర్-8 రౌండ్‌లోనే ఆ జట్టు ఇంటిదారిపట్టబోతోంది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 8 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంకను 148 రన్స్ లేదా అంతకంటే తక్కువ స్కోరుకు కట్టడి చేస్తే పాక్ సెమీస్‌కు వెళ్లేది. కానీ, 16 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక 150/5 స్కోరు చేయడంతో పాక్ ఆశలు గల్లంతయ్యాయి. పవన్ రత్నాయాకే మెరుపు హాఫ్ సెంచరీకితోడు కెప్టెన్ షనక కూడా రెచ్చిపోవడంతో పాక్‌కు షాక్ తప్పలేదు. ఇక ఈ మ్యాచ్‌లో పాక్ గెలిచినా ప్రయోజనం లేదు. దీంతో మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఒకవేళ పాక్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. పాక్, న్యూజిలాండ్ ఖాతాలో చెరో 3 పాయింట్లు ఉంటాయి. కానీ, నెట్‌రన్‌రేట్ పరంగా కివీస్ ముందడుగు వేస్తుంది.
Next Story






