- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు శ్రీలంకతో ఫైట్..మ్యాచ్ కు ముందే పాకిస్థాన్ ఎదురుదెబ్బ!
. సూపర్ ఫోర్ లో భాగంగా అబుదాబీలోని అంతర్జాతీయ స్టేడియం వేదికగా శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఇవాళ ఉంది

దిశ, వెబ్ డెస్క్: ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో సూపర్ ఫైట్ జరగనుంది. సూపర్ ఫోర్ లో భాగంగా అబుదాబీలోని అంతర్జాతీయ స్టేడియం వేదికగా శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఇవాళ ఉంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటల సమయంలో ఎప్పటిలాగే ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకము. ఎందుకంటే సూపర్ ఫోర్ లో భాగంగా ఇప్పటికే చెరో మ్యాచ్ ఆడాయి ఈ రెండు జట్లు.
ఇందులో పాకిస్తాన్....టీమిండియా చేతిలో ఓడిపోగా... బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఓడిపోయింది. అంటే ఈ రెండు జట్లు ఇవాల్టి మ్యాచ్ కచ్చితంగా గెలవాలి. గెలిచిన జట్టుకే ఫైనల్ అవకాశాలు ఉంటాయి. ఇవాళ ఏ జట్టు ఓడిపోయినా ఇంటికి వెళ్లడం గ్యారంటీ. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇవాల్టి మ్యాచ్ కు మరోసారిగా ఆండీనే రంగంలో దించబోతున్నారని తెలుస్తోంది. పాకిస్తాన్ ఆడే ప్రతి మ్యాచ్ కు అతడే రిఫరీగా ఉంటారట. ఇండియా షేక్ హ్యాండ్ ఇవ్వనందుకుగాను...ఆండీ పైన పాకిస్తాన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.






