- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్ లో బాంబు పేలుడు..స్వదేశానికి వెళ్లిపోతున్న శ్రీలంక క్రికెటర్లు !
8 మంది పాకిస్తాన్ ను వదిలి వస్తే, కొత్తగా మరో 8 మందిని పాకిస్తాన్ కు పంపించేందుకు శ్రీలంక బోర్డు ప్లాన్

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. వరుసగా బాంబు పేలుళ్లు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు, కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే శ్రీలంక ప్లేయర్లకు కూడా వచ్చింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఇటీవల కాలంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ లో పర్యటిస్తున్న శ్రీలంక ప్లేయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రెండు వన్డే మ్యాచ్ ఉంది.రావాల్పిండి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ వన్డే మ్యాచ్ లో తాము ఆడబోమని, పాకిస్తాన్ ను వదిలేసి తమ దేశానికి వెళ్లిపోయేందుకు 8 మంది శ్రీలంక క్రికెటర్లు సిద్ధం అయినట్లు కథనాలు వస్తున్నాయి. రావాల్పిండి స్టేడియం, పేలుడు జరిగిన ప్రదేశానికి దాదాపు 12 కిలో మీటర్ల దూరం ఉంటుందట. దీంతో వణికిపోతున్న 8 మంది శ్రీలంక ప్లేయర్లు తమ దేశానికి వెళ్లిపోవాలని అనుకుంటున్నారట.
ఈ మేరకు శ్రీలంక బోర్డుకు కూడా సమాచారం అందించారట. దీంతో పాకిస్తాన్, శ్రీలంక బోర్డుల మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ 8 మంది పాకిస్తాన్ ను వదిలి వస్తే, కొత్తగా మరో 8 మందిని పాకిస్తాన్ కు పంపించేందుకు శ్రీలంక బోర్డు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ టోర్నమెంట్ ఫినిష్ చేసి రావాలని తమ ప్లేయర్లకు శ్రీలంక బోర్డు ఆదేశాలు ఇచ్చిందట. అయితే ఆ 8 ప్లేయర్లు నిజంగానే శ్రీలంకకు వెళ్ళిపోతే, మిగిలిన ప్లేయర్లు కూడా ఆడడం కష్టమేనని చర్చ జరుగుతోంది. మరి కొన్ని గంటలు ఆగితే దీనిపై క్లారిటీ రానుంది.






