- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా, పాకిస్తాన్‌లతో జరిగిన వన్డే ట్రై సిరీస్ న్యూజిలాండ్ కైవసమైంది. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచింది. కరాచీ వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్‌లో పాక్‌పై 5 వికెట్ల తేడాతో కివీస్ విజయఢంకా మోగించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 49.3 ఓవర్లలో 242 పరుగులు చేసి ఆలౌటైంది. రిజ్వాన్(46), సల్మాన్ అఘా(45), తయ్యబ్ తాహిర్(38) పర్వాలేదనిపించడంతో పోరాడే స్కోరు దక్కింది. కివీస్ ఫాస్ట్ బౌలర్ విలియమ్ ఓరౌర్కె 4 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. బ్రేస్‌వెల్, కెప్టెన్ సాంట్నార్ తలో రెండు వికెట్లతో సత్తాచాటారు. ఆ తర్వాత 243 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 45.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డారిల్ మిచెల్(57, టామ్ లాథమ్(56) హాఫ్ సెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. విలువైన 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డెవాన్ కాన్వే(48), కేన్ విలియమ్సన్(34) కూడా మెరిశారు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ట్రై సిరీస్‌ను న్యూజిలాండ్ చక్కగా వినియోగించుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ట్రై సిరీస్ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో కివీస్ ఐసీసీ టోర్నీలో బరిలోకి దిగనుంది.






