T20 World Cup : పాక్‌ను భయపెట్టిన నెదర్లాండ్స్.. అతి కష్టం మీద గెలిచిన పాకిస్తాన్

by Harish |

T20 World Cup : పాక్‌ను భయపెట్టిన నెదర్లాండ్స్.. అతి కష్టం మీద గెలిచిన పాకిస్తాన్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌‌‌ను పాకిస్తాన్ గెలుపుతో ఆరంభించింది. కొలంబోలో శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్ గెలిచినా ఆ ఆనందాన్ని ఆ జట్టు మనస్ఫూర్తిగా ఆస్వాదించి ఉండదు. ఎందుకంటే పసికూన నెదర్లాండ్స్‌ ఓడించినంత పని చేసింది. పాక్ అతి కష్టం మీద ఓటమి నుంచి బయటపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 147 పరుగులే చేసి ఆలౌటైంది. ఆ జట్టులో ఎడ్వర్డ్స్(37), బాస్ డె లీడె(30) మాత్రమే పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లు సల్మాన్ మిర్జా, మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, సైమ్ అయూబ్ సమిష్టిగా రాణించి డచ్ జట్టును మోస్తరు స్కోరుకే కట్టడి చేశారు.

కానీ, పాక్ బ్యాటింగ్‌లో లోపాలు తొలి మ్యాచ్‌లోనే బయటపడ్డాయి. ఛేదనకు దిగిన ఆ జట్టును నెదర్లాండ్స్ బౌలర్లు బెంబేలెత్తించారు. బాబర్ ఆజామ్(15), కెప్టెన్ సల్మాన్ అగా(12), ఉస్మాన్ ఖాన్(0), షాదాబ్ ఖాన్(8) దారుణంగా విఫలమయ్యారు. కానీ, ఫర్హాన్(47), ఫహీమ్ ఆష్రఫ్(29 నాటౌట్) పోరాటంతో పాక్ విజయతీరాలకు చేరింది. ఆఖరి 12 బంతుల్లో పాక్ 29 రన్స్ చేయాల్సి ఉన్న స్థితిల్లో నెదర్లాండ్స్ సంచలనం సృష్టిస్తుందా అనిపించింది. కానీ, 19వ ఓవర్‌లో ఫర్హాన్ 24 రన్స్ రాబట్టి ఆ జట్టుకు ఊరటనిచ్చాడు. ఇక చివరి ఓవర్‌లో మూడో బంతిని ఫోర్‌ కొట్టి జట్టును గెలిపించాడు. నెదర్లాండ్స్ మరో 10-15 రన్స్ చేసినా లేదా 19వ ఓవర్ కట్టుదిట్టంగా పడినా పాక్ పరిస్థితి మరోలా ఉండేది.


Next Story