- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు బంగ్లా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్...గెలిస్తేనే ఫైనల్స్
బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్ ఫోర్ ఫైట్ ఇవాళ జరగనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్ ఫోర్ ఫైట్ ఇవాళ జరగనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా... ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఎప్పటిలాగే రాత్రి 8 గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఇందులో గెలవడం రెండు జట్లకు చాలా కీలకం.
ఇప్పటికే టీమిండియా ఫైనల్ కి చేరుకోగా.. శ్రీలంక ఇంటి దారి పట్టింది. ఫైనల్ వెళ్లే అవకాశం బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ కు మాత్రమే ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ఫైట్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓడిన జట్టు ఇంటి దారి పడుతుంది. ఒకవేళ వర్షం పడి, ఇతర కారణాల వల్ల మ్యాచ్ రద్దు అయితే...పాకిస్థాన్ ఫైనల్స్ కు చేరుతుంది. రన్ రట్ ఆధారంగా పాకిస్థాన్ కు ఎడ్జ్ ఉంటుంది. అంటే అప్పుడు టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ ఫైనల్స్ ఆడతాయి.






