Asia Cup : సెమీస్‌లో బంగ్లాపై పాక్ విక్టరీ.. ఫైనల్‌లో టీమిండియా‌తో ఢీ.. ఆసియా కప్ చరిత్రలో ఇదే తొలిసారి

by Harish |

ఆసియా కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.

Asia Cup : సెమీస్‌లో బంగ్లాపై పాక్ విక్టరీ.. ఫైనల్‌లో టీమిండియా‌తో ఢీ..  ఆసియా కప్ చరిత్రలో ఇదే తొలిసారి
X

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌ టైటిల్ పోరులో టీమిండియా ప్రత్యర్థి పాకిస్తాన్. సెమీస్‌లో పాక్.. బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాపై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు.20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. మహ్మద్ హరిస్(31), మహ్మద్ నవాజ్(25) పర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లు తస్కిన్ అహ్మద్, మహెది హసన్, రిషద్ హుస్సేన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాక్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. అయితే 136 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా విఫలమైంది. ఛేదనలో తడబడిన ఆ జట్టు 124/9 స్కోరే చేసింది. టాపార్డర్ తేలిపోగా షమిమ్ హుస్సేన్(30) కాసేపు పోరాటం చేశాడు. అయితే, హరిస్ రౌఫ్, షాహీన్ అఫ్రిది, సైమ్ అయూబ్ బంతితో రెచ్చిపోయి వరుసగా వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించారు. ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. ఆసియా కప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్‌లో తలపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


Next Story