పరువు నిలుపుకున్న పాకిస్తాన్.. టీ20 ప్రపంచకప్‌లో USAపై విజయం

by Gantepaka Srikanth |

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబో మైదానం వేదికగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది.

పరువు నిలుపుకున్న పాకిస్తాన్.. టీ20 ప్రపంచకప్‌లో USAపై విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబో మైదానం వేదికగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు 32 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టు గెలుపొందింది. యూఎస్ఏ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. జహంగీర్(49), మిలింద్(29), శుభమ్ (51) పరుగులతో అద్భుతంగా రాణించినా ఫలితం లేకుండా పోయింది. పాక్ బౌలర్లలో ఉస్తాన్ తారీక్ మూడు, షాదాబ్ ఖాన్ రెండు, అబ్రార్, నబాజ్ చెరో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (73) హాఫ్ సెంచరీతో రాణించారు. బాబర్ అజామ్ (46) పర్వాలేదనిపించారు. సైమ్ అయూబ్ (19) పరుగులు చేయగా.. కెప్టెన్ సల్మాన్ అఘా (1) సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగాడు. చివర్లో షాదాబ్ ఖాన్ (30) దూకుడుగా ఆడాడు. యూఎస్ఏ బౌలర్లలో వాన్ షాల్క్‌విక్ (4/25) ఆకట్టుకున్నాడు. సౌరభ్ నేత్రావల్కర్, మహ్మద్ మోసిన్, హర్మిత్ సింగ్ తలో వికెట్ తీశారు. గత టీ20 ప్రపంచ కప్‌లో పాక్‌ను యూఎస్‌ఏ ఓడించిన సంగతి తెలిసిందే.

Next Story