- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫుట్‌బాల్‌లో కూడా పాక్ పిచ్చి వేషాలు.. మళ్లీ ఇండియా చేతిలో చిత్తు!
ఫుట్‌బాల్‌లో కూడా పాక్ పిచ్చి వేషాలు వేసింది. అయినా సరే ఆటలో మళ్లీ ఇండియా చేతిలో చిత్తయింది. వరుసగా మూడు విజయాలతో సెమీస్‌కు భారత్ దూసుకెళ్లింది.

దిశ, స్పోర్ట్స్: శాఫ్ అండర్-17 ఛాంపియన్‌షిప్‌లో పాకిస్తాన్‌ను భారత జట్టు చిత్తుచేసింది. భారత కుర్రాళ్లు దాల్లుల్మున్ గాంగ్టే, గున్లీబా వాంగెరాక్పమ్, రహన్ అహ్మద్ తలో గోల్ వేయడంతో భారత జట్టు 3-2 తేడాతో భారత్ జయభేరి మోగించింది. ఈ విజయంతో గ్రూప్ బిలో టాపర్‌గా నిలిచిన టీమిండియా.. శాఫ్ ఛాంపియన్‌షిప్ సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. పాక్ ప్లేయర్ ముహమ్మద్ అబ్దుల్లా 43వ నిమిషంలో గోల్ చేసినప్పుడు చాయ్ తాగుతున్నట్లు వింతగా సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఇది కచ్చితంగా 2019 బాలాకోట్ దాడుల సమయంలో భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను మిమిక్ చేయడమేనని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ వెటకారం చేద్దామనుకున్న పాకిస్తాన్‌కు 73వ నిమిషంలో భారత్ దిమ్మతిరిగే బదులిచ్చింది. అహ్మద్ వేసిన గోల్‌తో పాక్‌ను చిత్తుచేసి సెమీస్‌లో అడుగుపెట్టింది. వరుసగా మూడు మ్యాచులు నెగ్గిన భారత్.. తమ తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఓడినప్పటికీ పాక్ కూడా సెమీస్ చేరింది. ఈ టీం సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో ఆడనుంది.






