- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసియా కప్‌కు మేం రెడీ.. ట్రై సిరీస్ గెలిచిన అనంతరం పాక్ ధీమా
by Phanindra |
ఆసియా కప్‌కు మేం రెడీ అంటూ పాకిస్తాన్ ధీమా వ్యక్తం చేసింది. యూఏఈ, అఫ్గానిస్తాన్‌తో జరిగిన ట్రై సిరీస్ గెలిచిన అనంతరం ఈ కామెంట్స్ చేసింది.

X
దిశ, స్పోర్ట్స్: ఆసియా కప్ 2025కు పాకిస్తాన్ గట్టిగా సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ మల్టీ నేషనల్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న యూఏఈ వేదికగానే ఆ దేశంతోపాటు అఫ్గానిస్తాన్‌తో పాక్ ట్రై సిరీస్ ఆడింది. ఈ సిరీస్ ఫైనల్‌లో అఫ్గాన్ జట్టును ఏకంగా 75 పరుగుల తేడాతో పాక్ నెగ్గింది. ఈ విజయంతో తమ జట్టులో కాన్ఫిడెన్స్ పెరిగిందని పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా అంటున్నాడు. తాము ఆసియా కప్ కోసం పూర్తిగా రెడీ అయ్యామని చెప్పాడు. ‘ఈ సిరీస్ జరిగిందే ఆసియా కప్ కోసం ప్రిపేర్ అవ్వడానికి. మేం ఒక జట్టుగా బాగా ఆడుతున్నాం. దాదాపు అన్ని బాక్సులు టిక్ చేసుకున్నాం. మంచి షేప్‌లో ఉన్నాం. ఆసియా కప్‌కు మేం రెడీ’ అని సల్మాన్ చెప్పాడు. ఈ సిరీస్‌లో పాకిస్తాన్ ఉన్న గ్రూపులోనే భారత్, ఒమన్, యూఏఈ జట్లు ఉన్నాయి. సెప్టెంబరు 14న భారత్, పాక్ మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది.
Next Story






